![]() |
![]() |

స్టార్ మాలో 'కార్తీక దీపం' సీరియల్ ఎంత పాపులర్ అయిందో అందరికి తెలిసిందే. గత కొన్ని వారాలుగా ప్రసారం అవుతున్న ఈ సీరియల్‌కి మహిళా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇందులో వంటలక్కగా దీప పాత్రలో నటించిన ప్రేమి విశ్వనాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ కారణంగా ఈమె స్టార్ సెలబ్రిటీగా మారిపోయింది.
ఈ సీరియల్ థీమ్‌ని వాడుకుంటూ వంటలక్క తరహాలో పాటలక్క పాత్రని డిజైన్ చేశారు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు. ఆయన నిర్మిస్తున్న తాజా సీరియల్ 'కృష్ణ తులసి'. జీటీవీలో ఈ సీరియల్ ఈ నెల 22 నుంచి ప్రసారం కాబోతోంది. ఈ సీరియల్ పబ్లిసిటీ కోసం పాపులర్ టీవీ నటీమణుల్ని రంగంలోకి దింపిన రాఘవేంద్రరావు కొత్త స్కీమ్‌ని ఈ సీరియల్ కోసం మొదలుపెట్టారు.
కృష్ణ తులసి మొక్కల పంపణీ ప్రారంభించిన రాఘవేంద్రుడు కొత్తగా బొట్టుబిళ్లల స్కీమ్‌ని ప్రారంభించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో బొట్టుబిళ్లల్ని ఈ సీరియల్ ప్రమోషన్ కోసం పంపిణీ చేస్తున్నారు. మరి రాఘవేంద్రుడి బొట్టుబిళ్లల స్కీమ్ ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి. 22న మొదలయ్యే ఈ ధారావాహిక సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6:30 గంటలకు జీ తెలుగులో ప్రసారం కాబోతోంది.
![]() |
![]() |